రక్తసింధూరం
వరద నీరులా పొంగిపొర్లిన
బాధితులకన్నీరు
తెల్లటి మంచు కొండల్లో
ఘనీభవించాయి
ఏరులా పొంగిపొర్లిన
పర్యాటకుల రక్తం
మోదుగు పూలై వికసించాయి
భారతీయుల కళ్ళల్లో
ఎగసి పడిన ఎర్ర జీర
రక్తసింధూరమై
అగ్ని అస్త్రమై
విష సర్పాల పుట్టల్ని ప్రేల్చేశాయి
భారతీయుల గుండె చప్పుళ్ళు
జయహో అంటూ
వీర జవాన్ లను కీర్తించే జయనాదాలు
భారతీయుల ఊపిరులు
రెపరెపలాడే జయకేతనాలు
ఈ మట్టిలోని కణం కణం
శాంతి వచనామృత శంఖారావం
ఈ మట్టిలోని అణువు అణువు
ఐక్యతా రాగ డమరుకనాదం
ఈ మట్టి చరిత్ర
చెక్కు చెదరని శిలాక్షరం
ఈ మట్టి విశ్వమాత
నుదుటి తిలకం
ముష్కరులారా! ఖబడ్దార్
నా దేశ మట్టి నుండి
గుప్పెడు మట్టిని కూడా తీసుకుపోలేరు
మేరా భారత్ మహాన్
