రుచికి దాసోహం దాసోహం
వాహ్ వాహ్ వాహ్ అనిపించే
వంగపూతతో అలరించే
శాకనాయక నామంతో ప్రసిధ్ధము
రుచికి దాసోహం దాసోహం!!!
వంగపూత చిన్న చిన్న పూలతో
వంగతోటలో కనువిందు చేసేను
వంటవండిన అమోఘమైన వాసన
రుచికి దాసోహం దాసోహం!!!
నవనవలాడుతూ తాజాదనంతో
వండిన వడ్డించిన వహ్వా వహ్వా
వండే ప్రతివంటలో రారాజు కాయ
రుచికి దాసోహం దాసోహం!!!
విరివిగా లోగిలిలో పెంచేరు
వంకాయతో చేసే ప్రసిద్ధవంటకము
గుత్తివంకాయ, అందరికి బహుప్రీతి
రుచికి దాసోహం దాసోహం!!!
వంకాయ అండి వంకాయ
వచ్చిన అతిథులకి విందులో పసందైనది
వగరు, చేదు లేని రుచికరము
రుచికి దాసోహం దాసోహం!!!!
